నేటి సాక్షి ఆగస్టు 12 జూపాడుబంగ్లా :-
నంద్యాల జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల ఉబిలో కూరుకు పోయారని చేతికి వచ్చిన మొక్కజొన్న పంట పశువుల మేతకు ఉపయోగపడుతుందని రైతాంగం అయోమయ పరిస్థితిలో ఉన్నారని తక్షణమే నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం. రమేష్ బాబు డిమాండ్ చేశారు.. బుధవారం తాటిపాడు గ్రామానికి విచ్చేసిన జిల్లా వ్యవసాయ అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల అనేక పంటలు నాశనం అయ్యాయని వర్షాలు కురువక పెట్టిన పెట్టుబడి రాక రైతులు కోట్ల రూపాయల నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు. కనీసం విత్తనాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బు లేని పరిస్థితి ఉందని, గ్రామాల్లో పనులు లేని పరిస్థితి ఉందన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ఉచితంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని వారు కోరారు. ఒకపక్క రైతులు తీవ్రంగా నష్టపోతుంటే మరోపక్క ఫర్టిలైజర్స్ యాజమాన్యం ధనార్జన ధ్యేయంగా అధిక రెట్లకు మందులు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే విజిలెన్స్ చే దాడులు జరపాలని ముందస్తుగా సరైన సమాచారం రైతులకు చేరవేసి పంటలపై అవగాహన కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి మక్బూల్ బాషా సలీం నాగన్న షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
Andhra
నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి..సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు*...
Quick Summary:
నంద్యాల జిల్లాలో వర్షాలు
