నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం లో సోమవారం రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఆర్.బి.ఎస్.కె మొబైల్ టీం ద్వారా పరిగి పట్టణంలోని హరిజన్ వాడలో గల మండల పరిషత్ పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులను స్వయంగా పరీక్షించారు.ఈ సందర్భంగా ఆర్ బి ఎస్ కే వైద్యులు, హెడ్మాస్టర్, విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు తరచుగా వచ్చే చిరు ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపాలు, దంత సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, నిత్యజీవితంలో ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు .
అంతేగాక స్వయంగా విద్యార్థులను పరీక్షించారు.
రక్తహీనతతో బాధపడుతున్న కొంతమంది విద్యార్థులకు వెంటనే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ ను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Telangana
విద్యార్థులకు నిర్వహిస్తున్న హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ అకస్మికంగా తనిఖీ. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్ లాల్.
Quick Summary:
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం లో సోమవారం
