నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 17 (రిపోర్టర్ ఇమామ్ సాబ్),
తెలంగాణా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు మరియు నారాయణపేట బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.రాజేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు సోమవారం నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తాల్లో బిఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని విగ్రహం ముందు బైఠాయించి తదుపరి తాసిల్దార్ కి వినతిపత్రం అందిజేసారు..
ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పథకాల విషయంలో "హైకోర్టు" నాలుగు సార్లు గడువు ఇచ్చిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చెయ్యలేదని దుయబట్టారు.అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టి పథకాలను రద్దుకు కుట్ర చేస్తోందని దీనిని వ్యతిరేకిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కేవలం కేసీఆర్ కాగిమీద కక్షతో కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తామని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతూ ఈ పథకాన్ని కనుమరుగు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు యధావిధిగా కొనసాగించకపోతే సమస్యను ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో ధన్వాడ మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
Telangana
ధన్వాడ లో బిఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన..... ధన్వాడ మండల తాసిల్దార్ కు వినతి......
Quick Summary:
ధన్వాడ మండల తాసిల్దార్ కు వినతి......