నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ప్రజల యొక్క సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భిన్నమైన స్పందన లభించిందని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ముక్క పాటి నరసింహారావు అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ శాఖకు 5 పంచాయతీరాజ్ శాఖకు 7, ఇరిగేషన్ శాఖకు ఒకటి, విద్యుత్ శాఖకు ఒకటి, హౌసింగ్ శాఖకు ఒకటి, చొప్పున మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయని ఆయా శాఖల అధికారులు వాటిని స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో దృవకుమార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ప్రభుత్వ వైద్యాధికారి శుభాష్ ఆయా శాఖ ల అదికారులు సిబ్బంది పాల్గొన్నారు
Telangana
**మండల స్థాయిలో ప్రజావాణి అమలు..*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో