నేటి సాక్షి ఆగస్టు 17పాములపాడు:-
2026 -27 సంవత్సరానికి సంబంధించి పాములపాడు మండలానికి 220 జీవాలకు భీమా లక్ష్యం నిర్దేశించడమైనదని పశువైద్యాధికారి డాక్టర్ పి.భాస్కర్ మీడియా సమావేశంలో తెలిపారు.
పాములపాడు మండలంలోని, గొర్రెల, మేకల పెంపకం దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ పి.భాస్కర్ కోరారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ పి.భాస్కర్ మాట్లాడుతూ వివరాలకు సమీపంలోని, రైతు సేవా కేంద్రంలోని అనీమల్ హస్బెం డ్రి అసిస్టెంట్ ,
స్థానిక పశువైద్యాధికారిని సమర్పించాలన్నారు.
పెంపకం దారులు 6 నెలలు దాటిన గొర్రెలకు, మేకలకు భీమా చేయించాలన్నారు.
1 సంవత్సరము రూ"లు 6,000/- భీమా వర్తించుట కొరకు చెల్లించవలసిన ప్రీమియం 180 రూపాయలు కాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ 153 పోను లబ్దిదారుడు కేవలం 27 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందనీ అన్నారు.
ప్రతి గొర్రె, మేక కి తప్పని సరిగా చెవి పోగు / ట్యాగ్ వేయించాలన్నారు.
ఎప్పుడైనా చెవి పోగు / ట్యాగ్ పడిపోతే వెంటనే పశువైద్య సిబ్బంది చేత కొత్త ట్యాగ్ వేయించాలనీ అన్నారు.
ట్యాగ్ లేనిచో భీమా వర్తించదనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో
సిబ్బంది తిరుమలేష్, కవిత, పాల్గొన్నారు.
Andhra
*85% సబ్సిడీతో గొర్రెలకు, మేకలకు పశు భీమా:-పి.భాస్కర్ (పశువైద్యాధికారి)*
Quick Summary:
2026 -27 సంవత్సరానికి సంబంధించి పాములపాడు మండలానికి 220 జీవాలకు భీమా లక్ష్యం