నేటి సాక్షి,మునగాల
ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం మంచి స్పందన లభించింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 24 మంది అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 10 దరఖాస్తులు అందాయి.
వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 3 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు 4, పంచాయతీరాజ్ ఎంపీవో విభాగానికి 1, వ్యవసాయ శాఖకు 1, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 1 దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భూ సమస్యలు, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
కార్యక్రమంలో ఎంపీడీవో కె. రమేష్ దీన్ దయాల్, తహసీల్దార్ వి. సరిత, ఎంపీవో డి. నరేష్, వ్యవసాయ అధికారి బుంగరాజు, పంచాయతీరాజ్ ఏఈ వసంత, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగరాజు, మునగాల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుశాంత్, రేపాల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వినయ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, విద్యుత్ శాఖ ఏఈ వికాస్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదిక...
Quick Summary:
ప్రజల సమస్యలను నేరుగా అధికారుల