నేటి సాక్షి ఆగస్టు 19పాములపాడు:-
పాములపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ 2025- 2026 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉపకార వేతనము ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఏపీ మోడల్ స్కూల్ నుండి ఆరుగురు విద్యార్థులు ఏ.పూజ వైష్ణవి, పి.జాయ్ స్టిల్లా, బి.పవన్ కళ్యాణ్, పి.లక్ష్మీ నారాయణ, ఎల్.రాజ వర్ధన్, ఎం.ప్రేమ రాజు లు ఎంపిక కావడం జరిగిందనీ ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థులను, తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను కళాశాల ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక కాపాడిన విద్యార్థులకు 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరము 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుండి కష్టపడి చదివితే, ఎన్నో విజయ శిఖరాలను అధిరోహించవచ్చని ప్రిన్సిపాల్-వి.నాగ రవీంద్ర తెలియజేశారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
Andhra
*నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ లకు ఆరుగురు విద్యార్థుల ఎంపిక:-వి.నాగ రవీంద్ర(మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్)*
Quick Summary:
పాములపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ