నేటి సాక్షి,మునగాల
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం ‘పోలీస్ ప్రజా భరోసా’ అవగాహన సదస్సు నిర్వహించారు. మునగాల ఎస్‌ఐ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినుల భద్రత, సామాజిక బాధ్యత, నేరాల పట్ల అప్రమత్తతపై పోలీసులు అవగాహన కల్పించారు.
డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల ప్రభావంతో భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని తెలిపారు.
రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమం గురించి వివరించారు. తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు భరోసా కల్పించారు.
కార్యక్రమంలో ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Telangana
విద్యార్థినులకు భద్రతా పాఠాలు..
Quick Summary:
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో