బుగ్గారం, (నేటి సాక్షి) జగిత్యాల జిల్లా బుగ్గారం మండల నూతన విద్యాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన *మోహన్ రెడ్డి గారికి* కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. బుగ్గారంలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన *మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్* ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు శాలువా కప్పి,శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నూతన ఎంఈఓ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందాలని, విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు కోడిమ్యల రాజన్న మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడెపు లింగన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*బుగ్గారం నూతన ఎంఈఓ మోహన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు*
Quick Summary:
సన్మానం చేశారు. బుగ్గారంలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన