నేటి సాక్షి ఆగస్టు 19పాములపాడు:-
మండల కేంద్రమైన పాములపాడులోని, డి నారాయణ రెడ్డి డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని కరస్పాండెంట్ దుగ్గెంపూడి.నారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. కనుక మా కళాశాలలో బి.ఎ. హానర్స్ (హిస్టరీ), బి.ఎ. హానర్స్ (స్పెషల్ ఉర్దూ), బీకాం హానర్స్ (కంప్యూటర్ అప్లికేషన్), బీఎస్సీ హానర్స్ (బాటని), బీఎస్సీ హానర్స్ ఎమ్.ఎల్.టి (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), బిఎస్సి హానర్స్ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీ కోర్సులకు రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మా డిగ్రీ కాలేజీ రాయలసీమ యూనివర్సిటీ అనుబంధ సంస్థ అని అన్నారు. కనుక ఆసక్తి ఉన్న విద్యార్థులు పాములపాడులోని, ఆత్మకూరు వైపు ఉన్న, కే.జీ.రోడ్డు ప్రక్కన మా డిగ్రీ కళాశాలకు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. మరిన్ని వివరాలకు కరస్పాండెంట్-944 100 0034, 9441000035 నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అన్నారు.
Andhra
*పాములపాడు డి.నారాయణ రెడ్డి డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోండి:-నారాయణరెడ్డి (కరస్పాండెంట్)*.
Quick Summary:
మండల కేంద్రమైన పాములపాడులోని, డి