నేటిసాక్షి న్యూస్ చౌడేపల్లి ఆగస్టు 20
ఓటర్ల జాబితా సవరణ, తప్పుల తొలగింపు మరియు పోలింగ్ కేంద్రాల మార్పు వంటి సమస్యలను 48 గంటల్లోగా పరిష్కరించాలని, ఓటర్లు మరియు రాజకీయ ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు . ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి మిద్దింటి కిషోర్ కోరారు చేశారు. గురువారం స్థానిక మండల పరిపాలన భవనంలో జరుగుతున్న ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియపై ఆయన అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో సుమారు 1,950 మంది ఓటర్లకు వివిధ రకాల సవరణలకు సంబంధించి నోటీసులు అందాయని తెలిపారు. ఇంటిపేరు, తండ్రి పేరు, పేర్లలో తప్పులు దొర్లాయని వారందరికీ నోటీసులు ఇచ్చారని, ఈ సమస్యలపరిష్కారంలో జాప్యం చేయకూడదని పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి సవరణల కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్లు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. నోటీసులు పొందిన వారందరికీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, రీ-వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఓటర్ల సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సరైన వివరాలతో కూడిన ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.
Andhra
ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి మిద్దింటి కిషోర్
Quick Summary:
ఓటర్ల జాబితా సవరణ, తప్పుల తొలగింపు