నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 21, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
నారాయణపేట జిల్లాలోని స్వర్గీయ శ్రీ. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ నారాయణపేట వారి సౌజన్యంతో
నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో 2025-2026 పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్ లుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ధన్వాడ మండలంలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ధన్వాడకు చెందిన విద్యార్థులు కైవసం చేసుకొన్నారు. కుమారి పి. ప్రణీత కు మొదటి నగదు బహుమతిగా రూ.10,000/-., జె. కార్తీక్ కు రెండో బహుమతిగా రూ . 5,000/- లు అందించడం జరిగింది. తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. ప్రదీప్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
పదవ తరగతి టాపర్లకు బహుమతుల ప్రధానం
Quick Summary:
నారాయణపేట జిల్లాలోని స్వర్గీయ