పాములపాడు ఆగస్టు 21 నేటి సాక్షి :-
ఏపీ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, నంద్యాల జిల్లా ఏపీ వడ్డెర సంఘం అధ్యక్షులు, స్మైల్ ఫౌండేషన్ అధినేత ఓర్సు రామసుబ్బయ్య జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాములపాడు మండలంలోని జాతీయ రహదారి 340 సి నందు స్నేహితులు శ్రేయోభిలాషులు ఆత్మీయుల మధ్యన ఏపీ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఓర్సు రామసుబ్బయ్య జన్మదినo సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. స్నేహితుల మధ్యలో చాలా సంతోషంగా ఆనందంగా ఆప్యాయంగా అందరూ కలిసి కేక్ కటింగ్ చేసి ఒకరి ఒకరి కేక్ ఆనంద తో స్వీట్స్ తినిపించుకున్నారు.ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని వడ్డెర.కార్పొరేషన మాజీ డైరెక్టర్ వారికి దేవుడు దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తోటి స్నేహితులు కోరుకోవడం జరిగింది.స్మైల్ ఫౌండేషన్ ప్రతినిధులు దూదేకుల మీరా సాహెబ్, తలముడిపి మా భాష, కాటిపోగు ప్రసాద్, ఆత్మకూరు ఆర్డబ్ల్యూఎస్ ఖాజా హుస్సేన్, వడ్డెర సంఘం ప్రతినిధులు కేక్ తినిపించి ఓర్సు రామసుబ్బయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.నంద్యాల జిల్లాలో నిరుపేదలకు స్మైల్ ఫౌండేషన్ అండగా ఉంటుందని చైర్మన్ ఓర్సు రామసుబ్బయ్య స్పష్టం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు విద్య ఉద్యోగ వైద్య రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు స్మైల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్మైల్ ఫౌండేషన్కు దాతలు సహాయ సహకారాలు అందించి నిరుపేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ప్రతినిధులు, వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు..
Andhra
ఘనంగా ఏపీ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామ సుబ్బయ్య జన్మదిన వేడుకలు
Quick Summary:
ఏపీ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, నంద్యాల జిల్లా ఏపీ వడ్డెర సంఘం అధ్యక్షులు, స్మైల్ ఫౌండేషన్
