నేటి సాక్షి గజ్వేల్ :----
గజ్వేల్‌లో ప్రముఖ సామాజిక సేవకుడు తలకొక్కుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి మాట్లాడుతూ, తలకొక్కుల చంద్రకళ–లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ లక్ష్మణ్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
అనంతరం లక్ష్మణ్ కుమారులు దుర్గాప్రసాద్, మధుసూదన్ మాట్లాడుతూ, తమ తండ్రి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, స్థానిక ప్రముఖులు లక్ష్మణ్‌ను ఘనంగా సత్కరించారు. ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు గాడిపల్లి భాస్కర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు డాక్టర్ కుమారస్వామి, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు దేవదాస్, మాజీ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, గాడిపల్లి శ్రీనివాస్, కుల పెద్దలు ఆడెపు బాలచంద్రం, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు స్వర్గం రాజేశం, సంఘం ప్రధాన కార్యదర్శి గాడిపల్లి రాజు, యువజన అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్, జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవసాని వాసుదేవు, కోశాధికారి దేవసాని హనుమందాస్, దేవసాని పోశెట్టి, తలకొక్కుల రాజేశం, సురేష్, రమేష్, లయన్ పరమేశ్వర్ చారి, ఎర్రం శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, మల్లేశం గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, పద్మశాలి సంఘం నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Telangana
సేవా కార్యక్రమాలతో సమాజానికి ఆదర్శం ఘనంగా తలకొక్కుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
Quick Summary:
గజ్వేల్‌లో ప్రముఖ సామాజిక సేవకుడు