నేటి సాక్షి, దోమ
(గూడ సురేష్ మోత్కూర్ )
పరిగి నియోజక వర్గం
దోమ మండల పరిధిలోని ఉదన్‌రావుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న అంజనేయ స్వామి, నవగ్రహ, కాలభైరవ స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం, నాగశిల ప్రతిష్ఠా మహోత్సవంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు BSR గారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం బుయ్యనీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్న BSR గారు స్వామివారికి శ్రావణ మాస ప్రత్యేక పూజలు.*
Quick Summary:
పరిగి నియోజక వర్గం