నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కూలీలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
శనివారం అటుగా వెళ్తున్న జీవన్ రెడ్డి, యువజన నాయకులు తాటిపర్తి చంద్రకృష్ణ రెడ్డి తో కలిసి వాహనం ఆపి కూలీలతో మాట్లాడారు. కూలీలు జీవన్ రెడ్డి చేయి పట్టుకుని తమ సాధకబాధకాలను చెప్పుకున్నారు.
*ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వారితో మాట్లాడుతూ*
"రోజుకు ఎంత కూలి వస్తుంది? గిట్టుబాటు అవుతుందా? రోజూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు?" అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిత్యం మురికి కాలువలు శుభ్రం చేయడానికి తాము జగిత్యాల రూరల్ మండలం చలిగల్ నుండి వస్తున్నామని, కూలీ గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్ల నుండి పిల్లలు చదువుకునే బడి దూరంగా ఉందని, ప్రతిరోజూ ఆటోలో పంపాల్సి వస్తోందని, నెలనెలా ఆటో కిరాయి భారం పడుతోందని కూలీలు జీవన్ రెడ్డితో సమస్యలు చెప్పుకున్నారు.
*దీనిపై స్పందించిన జీవన్ రెడ్డి....*
> గతంలో తాను ఒడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన పాఠశాలను మూసివేశారు. దీంతో ఒడ్డెర కాలనీ నుండి జాతీయ రహదారి దాటుకుని ఎస్సీ కాలనీ పాఠశాలకు వెళ్లేందుకు దాదాపు 2 కిలోమీటర్లు ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని,ఇది నిరుపేదలపై భారం పడుతోందని
మీ ప్రాంతంలోని పాఠశాలను వేరే ప్రాంతానికి మార్చడం వల్లే ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి రవాణా భత్యం కింద ఆటో ఛార్జీలు ఇప్పించేలా చొరవ తీసుకుంటానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.వెంటనే గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్ కు ఫోన్ చేసి విద్యార్థుల వివరాలతో జాబితా సిద్ధం చేయాలని సూచించారు.
ఆట్టి విద్యార్థుల జాబితాను జిల్లా కలెక్టర్ , జిల్లా విద్యాధికారికి సమర్పించి, ప్రభుత్వపరంగా రవాణా భత్యం పథకం ద్వారా విద్యార్థులకు ఆటో ఛార్జీలు చెల్లించేలా కృషి చేస్తామని కూలీలకు భరోసా ఇచ్చారు.
Telangana
*పారిశుధ్య కూలీలతో జీవన్ రెడ్డి ఆత్మీయ పలకరింపు* *విద్యార్థులకు రవాణా భత్యం, ఆటో ఛార్జీలు ఇప్పించేలా కృషి చేస్తా* *బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కూలీలకు భరోసా* -----------------------------------------
Quick Summary:
*బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కూలీలకు భరోసా