నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 22 ( రిపోర్టర్ ఇమామ్ సాబ్),
వార్షిక తనిఖీలో భాగంగా నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
నారాయణపేట: వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ శనివారం సమగ్రంగా తనిఖీ చేశారు.
ముందుగా పోలీస్ సిబ్బంది పరేడ్‌ను నిర్వహించి వారి టర్న్‌అవుట్‌ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో పరిశుభ్రతను పాటించాలని, ప్రహరీ చుట్టూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రతి వ్యక్తికి రిసెప్షన్ వద్ద తగిన విధంగా స్పందించి, ఫిర్యాదులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఫిర్యాదుదారులకు రసీదు అందించాలని ఆదేశించారు.
స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణ తదితర అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించి, సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని, నేరాల నియంత్రణ కొరకు ప్రతి గ్రామంలో పర్యటిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి కచ్చితంగా కనీసం 04 కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ... ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, ముఖ్యంగా, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి అంశాల్లో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించడంతో పాటు నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా సేవలందించాలని ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ డాక్టర్ వినీత్ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐ శివశంకర్, ఎస్‌ఐ సతీష్ రెడ్డి, ఎస్‌ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, ఎస్‌ఐ విజయ్ భాస్కర్, ఎస్‌ఐ-2 మన్యం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించాలి..... పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్...... కష్టపడి బాగా పని చేయాలి: ఎస్పీ ...ప్రతి ఒక్కరు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి.......
Quick Summary:
కష్టపడి బాగా పని చేయాలి: ఎస్పీ ...ప్రతి ఒక్కరు సాంకేతిక