నేటి సాక్షి ఆగస్టు 24 పాములపాడు :-
ఈ రోజు ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ " శక్తి యాప్ అవేర్నెస్ టీం " సిబ్బంది రాజశ్రీ నంద్యాల జిల్లా ఎస్పీరాజశ్రీ సునీల్ షోరాణ్ దొరవారి ఆదేశాల మేరకు, రాజశ్రీ ఆత్మకూరు డి.ఎస్.పి శ్రీ R.రామాంజి నాయక్ సారు గారి ఉత్తర్వుల మేరకు మరియు ఆత్మకూరు రూరల్ CI శ్రీ M. సురేష్ కుమార్ రెడ్డి సార్ పాములపాడు ఎస్ ఐ, పి తిరుపాలు గారి పర్యవేక్షణ లో ఆత్మకూరు " శక్తీ టీం " సిబ్బంది పాములపాడు ఏఎస్ఐ షేక్ నూర్ అహమ్మద్, ఉమెన్ హోమ్ గార్డ్ సుప్రియ లము పాములపాడు పి ఎస్ పరిధిలోని పాములపాడు లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ లో హాజరైన పాములపాడు మండలం లోని అంగన్వాడీ సెంటర్ల టీచర్లతో పాములపాడు మండల ICDS సూపర్వైజర్ శ్రీమతి లలిత ప్రభావతమ్మ మేడం గారి ఆధ్వర్యంలో మండలం లోనీ అంగన్వాడీ టీచర్లకు " శక్తీ యాప్ అవేర్నెస్ " ప్రోగ్రాము లో భాగంగా బాలికల మరియు మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన " శక్తి యాప్ " గురించి మరియు శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలుపుతూ, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన పోక్సో చట్టం గురించి, బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరగకుండా ఆపుటకు 1098 ఫిర్యాదు చేయవలెనని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని అట్లా ఎవరయినా చేస్తునట్లయితే 112 కు గానీ, 1098 కి ఫోన్ చేసి చెప్పాలని తెలుపుతూ..ఉమన్ వెల్ఫేర్ 181, ఎమర్జెన్సీ కాల్ 112, 100 కి ఫోన్ చేయవలెనని, సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని, ఫేక్ కాల్స్,apk ఫైల్స్ లాంటివి ఏదన్నా సెల్ ఫోన్ వాట్సప్ లకు ఎవరైనా లింక్ మెసేజ్లు పంపితే వాటిని ఓపెన్ చేయొద్దు అని తెలుపుతూ వాటి ద్వారా వారికీ జరిగే ఆర్థిక నష్టాలను గురించి కూడా తెలిపి,వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం అయినది, సార్. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లలలో శక్తీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని అత్యవసర సమయాలలో శక్తీ యాప్ ను ఎలా వాడాలి, దానీ ఉపయోగాల గురించి తెలుపడమే కాకుండా శక్తీ యాప్ ను వారి సెల్ ఫోన్ లలో డౌన్లోడ్ చేయించి ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినట్లయితే అధైర్య పడకుండా మీకు రక్షణ గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన " శక్తీ యాప్ " ను ఉపయోగించి 112 కు గానీ 1098 కి గానీ ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చు అని అవేర్నెస్ చేసినాము. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మైనర్ విద్యార్థులు ఎవరు కూడా మోటార్ సైకిల్ ను నడపడానికి ఇవ్వద్దని తెలియ పరిచినాము.... అదేవిధంగా మీ ఇంట్లోని వారు మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు ఖచ్చితంగా తలకు రక్షణగా " హెల్మెట్ " పెట్టుకొని ప్రయాణం చేయాలని హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి మరియు ఎవ్వరూ కూడా మీ ఇంట్లోని వారు మీ భర్త, కొడుకు,అన్నా,తమ్ముడు,మేనమామ లు ఎవ్వరైనా సరే మధ్యం త్రాగి వాహనాలను నడపవద్దని చెప్పమని సూచిస్తూ...త్రాగి వాహనం నడిపితే పోలీసులకు చిక్కి కేసు పెడితే కోర్టు వారు 10 వేల రూపాయలు ఫైన్ లేదా జైలు శిక్ష ను విధిస్తారు అని తెలుపుతూ అవేర్నెస్ ప్రోగ్రాం చేసినాము,సార్.
నమస్తే సార్.
Andhra
మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరికి శక్తి యాప్ గురించి అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్న ఏఎస్ఐ నూర్ అహమ్మద్.
Quick Summary:
ఈ రోజు ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ " శక్తి
