నేటి సాక్షి ఆగస్టు 24 నంద్యాల :-
ఎక్కువ రోగాలు కలుషిత నీటివల్లే వస్తున్నాయని, వాటి నివారణకు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలకు సురక్షితమైన, స్వచ్చమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నంద్యాల ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ఫ్లాంట్లు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
సోమవారం నంద్యాల మండలం గుంతనాల గోస్పాడు మండలం జిల్లెల్ల, పసురపాడు గ్రామ మజరా శ్రీరామ నగర్ గ్రామాలలో నంద్యాల ఎంపీ నిధులతో ఒక్కొక్క మినరల్ వాటర్ ఫ్లాంట్ కు రూ. 5 లక్షలతో మూడు గ్రామాల్లో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందనీ. ప్రతి గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, నంద్యాల ఎంపీడీఓ సుగుణశ్రీ, నంద్యాల రూరల్ తహసీల్దార్ శ్రీవాణి, పసురపాడు టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ ఆళ్లగడ్డ పుండరీకాక్ష రెడ్డి, ఆళ్లగడ్డ తులశీశ్వరరెడ్డి, గుంతనాల గ్రామ మాజీ సర్పంచ్ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Andhra
* ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యం..నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
Quick Summary:
ఎక్కువ రోగాలు కలుషిత నీటివల్లే వస్తున్నాయని, వాటి నివారణకు, ప్రజల ఆరోగ్యం కోసం
