నేటి సాక్షి ఆగస్టు 24జూపాడుబంగ్లా:-
నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, బంగ్లా మండలంలోని,
పోతిరెడ్డిపాడు వద్ద నీటి పరిస్థితిని పరిశీలించేందుకు, ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఎందుకు పూర్తిగా వినియోగించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు నియోజవర్గ సమన్వయకర్త డాక్టర్ దార సుధీర్, తదితర మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిశీలించేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకోవడానికి ఇంత భారీగా పోలీసులను మోహరించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
తుంగభద్ర, శ్రీశైలం జలాల్లో రాయలసీమకు దక్కాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని, ఎస్‌ఆర్‌బీసీకి నీటిని విడుదల చేసి రిజర్వాయర్లను నింపి రైతులకు కనీసం ఒక పంటకైనా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను తొలగించడం, వారిని బెదిరించడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని పోలీసు శాఖను కోరారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సమావేశాలు నిర్వహిస్తామని, అవసరమైతే అన్ని వర్గాల నాయకులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని శిల్పా చక్రపాణి రెడ్డి, డాక్టర్ ధార సుధీర్, తదితర నాయకులు స్పష్టం చేశారు.
రాయలసీమకు రావాల్సిన నీటి హక్కులను సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు & మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు పరిశీలకుడు బుడ్డా శేషి రెడ్డి, కర్నూలు మేయర్ పాపిరెడ్డి సురేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రసన్న కుమార్ రెడ్డి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఆర్టిఐ పాములపాడు మండల అధ్యక్షుడు ఎస్.శివలింగం, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, జడ్పిటిసి జగదీశ్ రెడ్డి, జెడ్పిటిసి యుగంధర్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి, వైఎస్ఆర్సిపి మహిళా విభాగం శశికళ రెడ్డి, తదితర జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది.
Andhra
*పోతిరెడ్డిపాడు సందర్శనకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం:–శిల్పా చక్రపాణి రెడ్డి, డాక్టర్ ధార సుధీర్*
Quick Summary:
నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం
